: తమ గ్రామానికి రావాలంటూ సీఎంను ఆహ్వానించిన మెదక్ జిల్లా గ్రామస్తులు
తమ గ్రామానికి రావాలంటూ సీఎం కిరణ్ ను మెదక్ జిల్లా వెల్టూరు గ్రామస్తులు ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన ముఖ్యమంత్రి త్వరలోనే వస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఆపనని వారితో ముచ్చటిస్తూ సీఎం అన్నారు. తానెవరికీ భయపడే వ్యక్తిని కానని తెలిపారు. సీఎంను తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని ఇటీవల కొంత మంది వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం ఈ విధంగా స్పందించారు.