: టైమ్ మ్యాగజైన్ 'ప్రభావశీలుర జాబితా'లో మలాల, ఒబామా కుమార్తె
టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో పాకిస్థాన్ బాలిక మలాల యూసఫ్ జాయ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మలియా నిలిచారు. 2013కు టైమ్ పత్రిక 16 మంది పేర్లతో ప్రభావశీలుర జాబితా విడుదలచేసింది. ఇందులో యువ గాయకులు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు, చిన్న వయసులోనే సైన్స్ లో అగ్రపథాన నిలుస్తున్న పిల్లలు, రచయితలు, మీడియా ప్రముఖులు ఉన్నారు.