: ఆంధ్రప్రదేశ్ నే ఎందుకు విభజిస్తున్నారు? : మైసూరారెడ్డి
దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విభజన వాదాలున్నాయని... అయితే, కేవలం ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే ఎందుకు విభజిస్తున్నారని వైసీపీ నేత మైసూరారెడ్డి ప్రశ్నించారు. జీవోఎంతో భేటీ అనంతరం మీడియాతో మైసూరా మాట్లాడారు. రాష్ట్రాల విభజనపై ఓ కమిటీ లేదా కమిషన్ వేసి విభజనపై నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ విభజనకు సిద్ధమైందని విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న వారిని ఒక్కసారిగా వెళ్లిపొమ్మంటే ఎంత బాధ పడతారో ఆలోచించాలని చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని జీవోఎంకు స్పష్టం చేసినట్టు మైసూరా తెలిపారు.