: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి


అనంతపురం జిల్లా కణేకల్ శివారులో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. కణేకల్ మండలం తమ్మిగనూరుకు చెందిన ఈ ముగ్గురు యువకులు మొహర్రం వేడుకలకు హనుమాపురం వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News