: పిల్లలు సైకిలు తొక్కితే మంచిదే


సైకిల్‌ తొక్కితే ఎవరికైనా మంచిదే. కానీ పిల్లలకు మరింత మంచిది. గతంలో అయితే సైకిలు తొక్కుకుని పాఠశాలకు వెళ్లడం వంటివి చేసేవారు. ఆడుకోవడానికైనా సరే సైకిల్‌తో బయటికి రివ్వున దూసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు సైకిల్‌ తొక్కేవారి సంఖ్య తగ్గుతోంది. అలాకాకుండా పిల్లలు సైకిల్‌ తొక్కేలా వారిని ప్రోత్సహించడం వల్ల వారికి శారీరకంగా ఎన్నో లాభాలున్నాయి.

ఎదిగే పిల్లలు సైకిల్‌ తొక్కడం వల్ల వారి కండరాలు దృఢంగా, శక్తిమంతంగా తయారవుతాయి. కాళ్లు, భుజాలు, చేతులు, వెన్ను, పొట్ట కండరాలలోకి రక్త ప్రసరణ మెరుగై ఆ భాగాల కండరాలు పటిష్టంగా తయారవుతాయి. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. రోజూ సైకిలు తొక్కడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి స్థూలకాయం ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. సైకిల్‌ను ఒక క్రమపద్ధతిలో తొక్కడం వల్ల శ్వాసకోశాలలోకి నిరంతరం గాలిని పీల్చుకోవడం ద్వారా ఆక్సిజన్‌తో కూడిన రక్తం ధమనుల ద్వారా కండరాల్లోకి ప్రవహిస్తుంది. ఫలితంగా కండరాలు ఎక్కువగా ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. ఇలా ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించడం వల్ల కణజాలం నుండి వ్యర్థ పదార్ధాలు బయటికి వెళతాయి. ఫలితంగా శరీరం కొత్త శక్తిని పొందుతుంది. సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిసిందికదా... మీ పిల్లల్ని సైకిల్‌ తొక్కేలా ప్రోత్సహించండి మరి!

  • Loading...

More Telugu News