: నితీష్ రాజీనామా చేయాలి: సుశీల్ కుమార్ మోడీ


గతనెల 27న బీహార్ లోని పాట్నాలో బీజేపీ జరిపిన 'హుంకార్ ర్యాలీ' సందర్భంగా తగినంత భద్రత కల్పించకపోవడం ద్వారా ర్యాలీకి హాజరైన లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చినందుకు నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ డిమాండ్ చేశారు. పాట్నాలో జరిగిన బీజేపీ జిల్లా శాఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'అధికార్ ర్యాలీ'కి చేపట్టిన భద్రతా చర్యలు, 'హుంకార్ ర్యాలీ'కి చేపట్టిన భద్రతా చర్యలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. 'హుంకార్ ర్యాలీ'కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, మెటల్ డిటెక్టర్లు, తనిఖీలు నిర్వహించలేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News