: తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆంక్షలు ఒప్పుకునేది లేదు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆంక్షలు విధిస్తే టీఆర్ఎస్ ఒప్పుకోదని ఆ పార్టీ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఏ ఆంక్షలు విధించినా ఒప్పుకోమన్నారు. హైదరాబాదుపై సర్వహక్కులు, అన్ని అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టినా తీవ్రంగా వ్యతిరేకత చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. భద్రాచలంను విడదీస్తే ఊరుకోబోమన్నారు.