: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేగింది. బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం, తొమ్మిదో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద బాంబు ఉందంటూ కంట్రోల్ రూంకు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వే, జీఆర్ పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల తరువాత బాంబు లేదని గుర్తించిన అధికారులు... ఫోన్ కాల్ ఎక్కడ్నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, సమాచారం ఇచ్చిన వ్యక్తి గురించి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News