: మే 24 నుంచి తానా సభలు


ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహా సభలు మే 24 నుంచి 26 వరకు జరగనున్నాయి. డలస్ లో నిర్వహించే ఈ సభలకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సహ ఆతిథ్యం ఇస్తోంది. కాగా, ఈ సభల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ చెప్పారు.

www.tana2013.org వెబ్ సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. కాగా, ఈసారి తానా సభల్లో 'అవధాన కళా వైభవం' పేరిట ఓ అవధాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఇంకా ఈ మహాసభలకు సినీ గీత రచయితలు సిరివెన్నెల, చంద్రబోస్, జొన్నవిత్తుల, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్ హాజరవుతారని వారు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News