: జీవోఎంకు లేఖ రాయాల్సిన అవసరం టీడీపీకి లేదు: యనమల
విభజన నిర్ణయం ఇప్పటికే తీసుకుని... మరోసారి అభిప్రాయాలు చెప్పాలంటూ అడిగిన జీవోఎంకు లేఖ రాయాల్సిన అవసరం తెలుగుదేశానికి లేదని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2008లో పొలిట్ బ్యూరో చేసిన తీర్మానానికే టీడీపీ ఇప్పటికీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు విభజన గురించి ముందే తెలిసినా... పెదవి విప్పకుండా ఇప్పుడు ప్యాకేజీలంటూ నాటకాలాడుతున్నారని యనమల మండిపడ్డారు. రాజమండ్రి దేవీచౌక్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పైవిధంగా అభిప్రాయపడ్డారు.