: తీవ్రవాద దాడుల కవరేజిలో సంయమనం పాటించాలి: మీడియాకు కట్జూ హితవు
తీవ్రవాద దాడుల ఘటనల కవరేజి సందర్బంగా మీడియా సంయమనం పాటించాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ హితవు పలికారు. హైదరాబాద్ పేలుళ్ల ఘటనలో మీడియా అతిచొరవ ప్రదర్శిస్తోందంటూ జాతీయ మైనార్టీల సంఘం అధ్యక్షుడు వజాహత్ హబీబుల్లా.. కట్జూకు ఓ లేఖ రాశారు. ఈ విషయంపై కట్జూ స్పందిస్తూ, మతసామరస్యంపై ప్రభావం చూపే అంశాలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వరాదని ఆయన సూచించారు.