: పాక్ క్రికెట్ టీంను నాశనం చేశారు : మొహమ్మద్ యూసుఫ్


దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను పాక్ 1-4 తేడాతో కోల్పోవడంతో... పాక్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసుఫ్ విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం పాక్ జట్టులోని యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసేవారే కరవయ్యారని విమర్శించాడు. బ్యాట్స్ మెన్ కు రోల్ మోడల్ గా ఎవరినీ చూపెట్టడం లేదని దుయ్యబట్టాడు. తాము ఆడే రోజుల్లో జావెద్ మియాందాద్, ఇంజమామ్ లను రోల్ మోడల్ గా తీసుకున్నామని... అందుకే అద్భుత రీతిలో పాక్ కు విజయాలను అందించేవారమని అన్నాడు. ప్రస్తుతం జట్టులో స్పూర్తి నింపేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు.

భారత జట్టులో కోహ్లీ, రోహిత్ లాంటి బ్యాట్స్ మెన్ లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారని... వారు భారత్ లోని గొప్ప ఆటగాళ్లను రోల్ మోడల్ గా తీసుకుని స్పూర్తిని పొందుతున్నారని అన్నాడు. పాక్ కెప్టెన్ మిస్బా స్వార్థపూరితంగా ఆడుతున్నాడని... పరుగులు చేయడానికి అనేక బంతులను తినేస్తున్నాడని విమర్శించాడు. పాక్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీ చేస్తే చాలు... అదే గొప్ప ఇన్నింగ్స్ అన్నట్టుగా ఆడుతున్నారని ఎద్దేవా చేశాడు. మరో వైపు, భారత ఆటగాళ్లు, సెంచరీలతో కదం తొక్కుతున్నారని యూసుఫ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ క్రికెట్ బోర్డు రాజకీయాలను పక్కన పెట్టి ఇంజమామ్ లాంటి గ్రేట్ బ్యాట్స్ మెన్ ను బ్యాటింగ్ చీఫ్ కోచ్ గా ఎంపిక చేయాలని కోరాడు. లేకపోతే పాక్ క్రికెట్ భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News