: జీవోఎంతో అసదుద్దీన్ ఒవైసీ భేటీ


ఢిల్లీలో రాజకీయ పార్టీలతో కేంద్ర మంత్రుల బృందం (జీవోఏం) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో జీవోఎం భేటీ అయింది. ఇరవై నిమిషాల పాటు జరిగే ఈ సమావేశంలో విభజనపై ఆ పార్టీ నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. ప్రధానంగా హైదరాబాద్ యూటీ అంశంపైనే ఎంఐఎం నేత చర్చిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు షిండేతో ఒవైసీ వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. సమావేశంలో షిండే, ఆజాద్, మొయిలీ, జైరాం రమేష్, టాస్క్ ఫోర్స్ చీఫ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఏకే ఆంటోనీ తొలిసారి సమావేశానికి వచ్చారు. అనంతరం సీపీఐ, బీజేపీ, వైస్సార్సీపీలతో జీవోఎం సమావేశమమవుతుంది.

  • Loading...

More Telugu News