: అఖిలపక్ష భేటీకి టీడీపీ వెళ్లదు: గాలి ముద్దుకృష్ణమ
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర టీడీపీ నేతలు... అఖిలపక్ష భేటీకి వెళ్లకూడదని ఈ ఉదయం సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జీవోఎం నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి టీడీపీ వెళ్లదని తెలిపారు. రెండు ప్రాంతాల నుంచి ప్రతినిధులను పిలిచి మాట్లాడాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. అయితే, జీవోఎం రాష్ట్రమంతా తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కాగా, పార్టీ నుంచి లేఖ ఎవరికి రాయాలనే అంశంపై సాయంత్రం మరోసారి సమావేశమై నిర్ణయిస్తామని గాలి ముద్దుకృష్ణమ వెల్లడించారు.