: అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదు... చంద్రబాబుతో భేటీలో మెజారిటీ నాయకుల అభిప్రాయం


ఇరు ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో, రేపటి అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలా? వద్దా? అనే అంశంపై వీరు చర్చించారు. అయితే, అఖిలపక్ష భేటీకి వెళ్లరాదని చర్చలో పాల్గొన్న ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అంతే కాకుండా, అఖిలపక్ష సమావేశానికి ఎందుకు హాజరవడం లేదన్న విషయమై... రాష్ట్రపతికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో, ఈ సాయంత్రం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News