: క్యాట్, జెట్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ప్రవేశపెట్టిన ఆర్టీసీ


క్యాట్, జెట్, కపుల్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. పాత కార్డుల స్థానంలో కొత్తగా విహారీ, నవ్య క్యాట్ కార్డులు ప్రవేశపెట్టారు. రూ. 250 విలువైన నవ్య క్యాట్ కార్డు తీసుకుంటే నలుగురు కుటుంబ సభ్యులకు 10 శాతం రాయితీ ఇస్తారు.

ఈ కార్డుపై ప్రమాద బీమాను రూ. 1.75 లక్షలకు పెంచారు. ఇక జెట్, కపుల్ కార్డుల స్థానంలో విహారీ కార్డులు ప్రవేశపెట్టారు. రూ.500 విలువైన విహారీ కార్డుపై 50 శాతం రాయితీతో ఏడు రోజులు ప్రయాణించవచ్చు. అయితే ఏసీ బస్సులకు ఈ రాయితీ వర్తించదు. కొత్తగా ప్రవేశ పెట్టిన కార్డులు ఈ నెల 8 నుంచి అన్ని ప్రధాన బస్టాండ్లలో, డిపోల్లో అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. 

  • Loading...

More Telugu News