: వెంకన్నను దర్శించుకున్న శైలజానాథ్, దినేష్ రెడ్డి
తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి శైలజానాథ్, మాజీ డీజీపీ దినేష్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున వీరిద్దరూ వేర్వేరుగా శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మంటపంలో వారికి తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.