: ఇదంతా మహిళల కోసమే


రోజు రోజుకూ మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి రక్షణకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పలు రకాలైన వస్తువులను మహిళలు తమ ఆత్మరక్షణకు వినియోగించుకునే విధంగా నిపుణులు రూపకల్పన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒడిశా, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు భద్రత కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

మహిళా రక్షణ చర్యల్లో భాగంగా భువనేశ్వర్‌లో కండక్టర్‌ ఉద్యోగాల్లో ఆడవారిని నియమించడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకోసం స్థానికంగా పేరొందిన ఒక ప్రైవేటు ఏజెన్సీ అన్నివేళలా సేవలను అందించేందుకు వీలుగా ప్రత్యేక మహిళా కండక్టర్ల బృందాన్ని సిద్ధం చేసింది. అలాగే బస్టాపుల్లో ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ కల్పించేందుకు 'పాసింజర్స్‌ కేర్‌ టేకర్‌' పేరుతో ఒక మహిళా బృందాన్ని తీర్చిదిద్దింది. ఇక కేరళ ప్రభుత్వం క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా 'షీ ట్యాక్సీ' విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో క్యాబ్‌లను మహిళలే నడుపుతారు. అయితే ఈ మహిళలు ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరిన వాళ్లు. ఏదైనా ప్రమాదం ఎదురైతే అప్పటికే అనుసంధానించి వున్న కంట్రోల్‌ రూమ్‌కి సమాచారాన్ని అందించి, బాధితులకు సాయం అందేలా చేస్తారు. ఇలా ప్రభుత్వాలు మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News