: 'రామ్ లీలా' చిత్రాన్ని నిలిపేయండి: యూపీ సీఎంకి ఫిర్యాదు


బాలీవుడ్ సినిమా 'రామ్ లీలా' విడుదలను అడ్డుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సామాజిక కార్యకర్త ఊర్వశి శర్మ ఫిర్యాదు చేశారు. తాను 'రామ్ లీలా' సినిమా టైటిల్ పై ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. 'గోలీయోంకి రాస్ లీలా రామ్ లీలా' సినిమా టైటిల్ లో 'రామ్ లీలా' పేరును తొలగించాలని ఆమె కోరినట్టు తెలిపారు. ఒకవేళ ఆ పదాన్ని తొలగించకపోతే నేషనల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. 'రామ్ లీలా' అనే పదం లక్షలాది ప్రజల మనోభావాలకు సంబంధించినదని, ప్రోమో లో చాలా సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె తెలిపారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా నటించారు. కాగా ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News