: కోల్ కతా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ తారల సందడి


కోల్ కతాలో 19 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండుగగా ప్రారంభమైంది. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, కమలహాసన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు గాయని ఉషాఉతుప్, కొంకణాసేన్, అపర్ణాసేన్, జయాబచ్చన్, మిధున్ చక్రవర్తి, ఇతర బెంగాలీ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల పాటు జరుగనున్న ఈ సినీ కార్నివాల్ లో 63 దేశాలకు చెందిన 189 సినిమాలు ప్రదర్శించనున్నారు.

  • Loading...

More Telugu News