: మార్స్ ఆర్బిటర్ కు తొలి ఆటంకం


ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన 'మంగళయాన్' మార్స్ మిషన్ కు చిన్న ఆటకం ఏర్పడింది. వేర్వేరు దిశల్లో కక్ష్యలు మారుతూ లక్ష్యం దిశగా సాగాల్సిన మార్స్ ఆర్బిటర్ ఈసారి కక్ష్య పెంపులో తొలి ఆటకం ఎదుర్కొంది. దీంతో లక్ష కిలో మీటర్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్దేశించిన దూరం కన్నా 10 వేల కిలోమీటర్ల దిగువలో ఉంది. అయితే దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇస్రో చైర్మన్ రాథాకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం మార్స్ ఆర్బిటర్ భూమికి 78 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. 'మంగళయాన్' కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చుచేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News