: చత్తీస్ గఢ్ ఎన్నికల్లో 'వీరెవరూ వద్దు' ఆప్షన్ ప్రవేశ పెట్టిన ఎన్నికల సంఘం


నచ్చని అభ్యర్థులను తిరస్కరించే హక్కు తొలిసారిగా చత్తీస్ గఢ్ ఎన్నికలలో అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ దేశంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రత్యేకంగా 'నోటా'బటన్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తిరస్కరణ ఓటుకు 'నోటా' అంటే 'వీరెవరూ వద్దు' అనే పేరు పెట్టారు. అయితే తిరస్కరణ ఓటుకు, పోలింగ్ కు సంబంధం లేదు. పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News