రాష్ట్రంలో విద్యుత్ కోతలు, చార్జీల పెంపుపై వామపక్షాలు సమరభేరి మోగించాయి. ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 10న జిల్లాల్లో మండల కేంద్రాల ముట్టడికి పది వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అలాగే, ఏప్రిల్ 21 నాటికి విద్యుత్ చార్జీల పెంపును వెనక్కి తీసుకోకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించాయి. హైదరాబాదులోని మగ్దూం భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న వామపక్షాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు.