: టీడీపీ తెలుగు జాతి అభివృద్ధి కోసం పుట్టింది:చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి అభివృద్ధి కోసం పుట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు తెలిపారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన టీడీపీ మేథోమధన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎవీఎస్ టీడీపీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరదలకు చాలా మంది మృతి చెందారని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత రెండు రచ్చబండ కార్యక్రమాల్లో ఏం ఒరగబెట్టారని మరోసారి ప్రభుత్వం రచ్చబండకు సిద్ధమైందని ఆయన నిలదీశారు.