: పట్టపగలు చోరీ... రూ. 4.9 లక్షలు అపహరణ
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో దుండగులు 4.9 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ రోజు ఉదయం బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తున్న భారత్ గ్యాస్ ప్రతినిధి నుంచి డబ్బులు లాక్కుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.