: ఉగాండాలో హన్మకొండ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాల్చివేత
ఉగాండా దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హన్మకొండ రెడ్డి కాలనీకి చెందిన దాసరి రఘురామ్ ను శనివారం రాత్రి దుండగులు దారుణంగా కాల్చి చంపారు. డబ్బు కోసం దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. 27 సంవత్సరాల రఘురామ్ ఏడాదిన్నర క్రితం నుంచి ఉగాండాలో నెట్ వర్క్ సెక్యూరిటీస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం రఘురామ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భోరున విలపించారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ రాజయ్య, కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు విద్యాసాగర్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ తదితరులు నిన్న మధ్యాహ్నం హన్మకొండలోని రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘురామ్ మృత దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు.