: తిట్టేవారిని ముందుగానే గుర్తించేస్తే...!


మనుషుల కంటే కేమెరాలే నయమనిపించే రోజులు రానున్నాయి. ఎందుకంటే, మనం ముందుగా గుర్తించలేని విషయాలను కెమెరాలు గుర్తించనున్నాయి. మన మీద హఠాత్తుగా ఎవరైనా దాడిచేయబోతుంటే, ఆ విషయాన్ని ముందుగానే గుర్తించగలిగే కెమెరాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆయా వ్యక్తుల శారీరక కదలికల ఆధారంగా ఈ దాడి విషయాన్ని ఈ కెమెరా ముందుగానే పసిగడుతుందట.

వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 'కిన్టెన్స్‌ అనాలసిస్‌'గా పిలిచే ఒక సరికొత్త కెమెరా వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ కెమెరా వ్యక్తులు తన్నడం, కొట్టడం వంటి చర్యలను ముందుగానే పక్కాగా అంచనా వేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు తిట్లను కూడా ఈ కెమెరా గుర్తించే విధంగా దీని వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇలా చేయడం వల్ల వ్యక్తుల ప్రమాదకర చర్యలను మరింత పక్కాగా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News