: కంట్రోల్ రూం నుంచే రైలుకు బ్రేక్ వేసే సౌకర్యం


వేగవంతమైన రైళ్ల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కంట్రోల్ రూంలలో ఇక్కడి నుంచే బ్రేక్ వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైలు వేగం పెంచే క్రమంలో భాగంగా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఉన్న వాకీటాకీల స్థానంలో కొత్తగా మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్(ఎంటీఆర్సీ) వ్యవస్థను ప్రవేశ పెడుతోంది. రైలు డ్రైవర్, కంట్రోల్ రూం మధ్య కమ్యూనికేషన్స్ మరింత నాణ్యంగా ఉండేదుకు రైల్వేశాఖ ఈ చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని ఎంటీఆర్సీ అధికారులు వెల్లడించారు. తొలుత ఈ వ్యవస్థను ఢిల్లీ -లుధియానా, హౌరా-మొఘల్ సరాయ్, కోల్ కతా మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News