: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: ఆనంద్, కార్ల్ సన్ మధ్య రెండో మ్యాచ్ డ్రా
డిఫెండింగ్ ఛాంపియన్ ఆనంద్, ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో రెండో మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఈ ఛాంపియన్ షిప్ చెన్నైలో జరుగుతోంది. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ కూడా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండు వరుస డ్రాలతో... ఆనంద్, కార్ల్ సన్ లు చెరొక పాయింట్ సాధించారు. ఇంకా 10 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.