: సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం : హరీష్ రావు


కిరణ్ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ వాసులు, తెలంగాణ ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని తెరాస నేత హరీష్ రావు అన్నారు. రచ్చబండ కార్యక్రమానికి సీఎం రాకుండా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి సహకరిస్తే... వారంతా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని హరీష్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News