: మహిళలను గౌరవించే విధంగా పిల్లలను చైతన్యవంతులను చేయాలి: కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్
ఇటీవలి కాలంలో మహిళలపై నేరాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిళలను గౌరవించే విధంగా చిన్నప్పటి నుంచే పిల్లలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్ లో మంత్రి మాట్లాడారు.
"మానవుల ప్రవర్తన జంతు సమానంగా మారింది. ఇళ్లల్లోనూ, స్కూళ్ళలోనూ ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం చూస్తే 90 శాతం అత్యాచారాలన్నీ బాధితులకు తెలిసిన వ్యక్తుల ద్వారానే చోటు చేసుకుంటున్నాయి" అన్నారు మంత్రి ఆర్పీఎన్ సింగ్.
సమాజంలో ప్రతి ఒక్క మహిళను కచ్చితంగా గౌరవించాలని మన పిల్లలకు బోధించాలన్నారు. కాగా, ఆత్మరక్షణ కోసం మహిళలకు వివిధ అంశాలలో ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని చెప్పారు. 2012లో 9,790 మంది మహిళలకు ఢిల్లీలో ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చామని వివరించారు.
అంతేకాకుండా, మహిళా క్యాబ్ డ్రైవర్లకు ఢిల్లీ పోలీసులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారన్నారు. అన్నిరాష్ట్రాల పోలీసు బలగాల్లో 33 శాతం మహిళలను నియమించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా తమ బలగాల్లో 522 మంది మహిళలను నియమించారని తెలియజేశారు.