: నదీ జలాల దోపిడికే కేంద్రం కుట్రలు : దేవినేని ఉమ
రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ కు ప్రమాదకరమని తెలిసినా కేంద్ర మంత్రులు, ఎంపీలు పట్టించుకోవడం లేదని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. జీవోఎం పేరుతో కృష్ణా, గోదావరి నీటిని కర్ణాటక, మహారాష్ట్రలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, ఎంపీలు దద్దమ్మల్లా కూచోకుండా... జల దోపిడిని ఆపాలని చెప్పారు. విజయవాడలో ఈ రోజు దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. అక్రమంగా సంపాదించి ఇడుపులపాయలో దాచిన నల్లధనాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తరలించే ఏర్పాట్లలో జగన్ ఉన్నారని విమర్శించారు.