: 3డీ లివర్.. 40 రోజులు పనిచేస్తుంది..


కాలేయం కాస్తా పేపర్ రూపంలో మారిపోయి.. త్రీడీ ప్రింటర్ లోంచి క్షణాల్లో టకటకమంటూ ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహలకు కూడా అందని దీనిని అమెరికాకు చెందిన వైద్య పరిశోధన కంపెనీ ఆర్గాన్వో నిజం చేసింది. 20 పొరలతో హెపటోసైట్స్ ను కలిగి ఉండే ఇది అచ్చం మానవ కాలేయంగా 40 రోజుల పాటు అన్ని పనులను నిర్వహించగలదట. అర మిల్లీమీటరు మందం, నాలుగు మిల్లీమీటర్ల వెడల్పుతో ఇది ఉంటుంది. రక్తనాళాల గోడల్లో ఉండే కణాలను ఈ పేపర్ లివర్ లో ప్రింట్ చేయడం వల్ల పోషకాలు, ఆక్సిజన్ ను తీసుకోవడానికి వీలు పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిజంగా ఇది అద్భుతం!

  • Loading...

More Telugu News