: ప్రపంచంలోనే పవర్ ఫుల్ సిక్కుగా ప్రధాని మన్మోహన్ సింగ్
ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచంలోనే శక్తిమంతమైన సిక్కుగా నిలిచారు. ప్రపంచంలో శక్తిమంతమైన, ప్రభావవంతమైన సిక్కులతో సిఖ్ 100 పేరుతో సిఖ్ డైరెక్టరీ లండన్ లో ఒక జాబితాను విడుదల చేసింది. 81ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రథమ స్థానంలో, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రెండో స్థానంలో, శ్రీ అకల్ తక్త్ సాహిబ్ కు అధిపతిగా ఉన్న జతేందర్ సింగ్ మూడో స్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ నాలుగో స్థానంలో నిలిచారు.