: రేపట్నుంచి కేరళలో పర్యటించనున్న బ్రిటీష్ యువరాజు
బ్రిటీష్ యువరాజు చార్లెస్, ఆయన సతీమణి కెమిల్లా పార్కర్ రేపటి నుంచి నాలుగు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా, వారు రాష్ట్రంలోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రత కోసం కేరళ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. వారు పర్యటించే ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేస్తోంది. ఇప్పటికే చార్లెస్ దంపతులు డెహ్రాడూన్, ఢిల్లీ, ముంబై, పూణె నగరాల్లో పర్యటించారు. కేరళ పర్యటన అనంతరం వీరు కొలంబో వెళతారు.