: హయాన్ పై చైనా ఆరెంజ్ అలర్ట్
రెండో అత్యంత ప్రమాద హెచ్చరిక ఆరెంజ్ ను చైనా ప్రభుత్వం జారీ చేసింది. హయాన్ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హైనన్, గాంగ్ డాంగ్, గాంగ్సి జువాంగ్ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నివారణ విభాగం అధికారులను అప్రమత్తం చేసింది. ఈ ఏడాది చైనా తీరాన్ని తాకనున్న 30వ పెను తుపానులో హయాన్ కూడా ఒకటి.