: మోడీ వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఛత్తీస్ గఢ్ ర్యాలీలో మోడీ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు ఈ రోజు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును.. ఖూనీ హస్తం, క్రూర హస్తం అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించి ఒక డీవీడీని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఫిర్యాదుతోపాటు ఈసీకి పంపించింది. మోడీ వ్యాఖ్యలు విద్వేషపూరితం, హానికరంగా పేర్కొంది.