: వియత్నాంలో 6లక్షల మంది తరలింపు
ప్రచండ తుపాను హయాన్ తమ దేశం వైపు భీకరంగా దూసుకు వస్తుండడంతో వియత్నాం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిప్పీన్స్ లో 10వేల మందికి పైగా బలితీసుకున్న ఈ తుపాను నుంచి రక్షణ కోసం వియత్నాం ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని 6లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.