: ఫిలిప్పీన్స్ కు పెంటగాన్ సాయం
హయాన్ తుపానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ కు సాయం చేయడానికి పెంటగాన్ అంగీకరించింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి చుక్ హాగెల్ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్టులను ఫిలిప్పీన్స్ కు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సహాయక కార్యక్రమాలకు చేయూతనివ్వాలని యూఎస్ పసిఫిక్ కమాండ్ కు దిశానిర్దేశం చేశారు.