: అత్యాచారాల పండగపై నిరసనలు
అసోంలో అత్యాచారాల పండగ అంటూ అమెరికాకు చెందిన నేషనల్ రిపోర్ట్ డాట్ నెట్ ప్రచురించిన కల్పిత వార్తపై అసోంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీన్ని ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది. 'అసోం అత్యాచారాల పండగ వార్త హాస్యాస్పదం కాదు. ఇది అనైతికం, అసహ్యకరం, హేయం.. అందరూ ఖండించాల్సిన విషయం' అంటూ అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మీడియా సలహాదారు భారత్ నారా పేర్కొన్నారు. దీనిపై అసోం సీఐడీ విభాగం కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించింది. అసోంకు చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి అసత్యవార్తను సృష్టించారంటూ అసోంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.