: నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు


ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ రోజు 'అమరుల తల్లుల కడుపు కోత మహాసభ' జరగనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి సంస్మరణార్థం ఈ సభను నిర్వహిస్తున్నారు. దీంతో, సభ జరగనున్న నిజాం కళాశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల వరకు అమల్లో ఉంటాయని అడిషనల్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) అమిత్ గార్గ్ తెలిపారు.

తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట నుంచి బషీర్ బాగ్ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి క్రాస్ రోడ్స్ వరకు అనుమతించరు. వీరంతా ఈడెన్ గార్డెన్స్ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లాలి.

అప్పర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్ నుంచి బషీర్ బాగ్ క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాలు... లిబర్టీ క్రాస్ రోడ్స్ మీదుగా హిమాయత్ నగర్ వైపు వెళ్లాలి.

నారాయణ గూడ క్రాస్ రోడ్స్ నుంచి బషీర్ బాగ్ వైపు వచ్చే వాహనాలు లిబర్టీ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లాలి.

రవీంద్రభారతి, నాంపల్లి నుంచి నిజాం కాలేజ్ వైపు వచ్చే వాహనాలు ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుగా వెళ్లాలి.

అబిడ్స్, చర్మాస్ నుంచి బషీర్ బాగ్ వైపు వెళ్లే వాహనాలను... గన్ ఫౌండ్రీలోని ఎస్ బీహెచ్ జంక్షన్ నుంచి సుజాతా స్కూల్ వైపు మళ్లిస్తారు.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కేఫ్ బహర్ మీదుగా నిజాం కాలేజ్ వైపు వెళ్లే వాహనాలను ఎన్ సీసీ గల్లీ మీదుగా కింగ్ కోఠి క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.

సిమెట్రీ జంక్షన్ నుంచి బషీర్ బాగ్ క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమాయత్ నగర్ కు మళ్లిస్తారు.

  • Loading...

More Telugu News