: సమాధి శ్వాస తీసుకుంటోందా....?
మానవులు, జంతువులు శ్వాస తీసుకోవడం తెలుసు. మరేంటి చిత్రంగా ఒక సమాధి శ్వాస తీసుకోవడం ఏంటి? కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి దర్గాలోని సమాధి ఊపిరి తీసుకుంటోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదీ పగలు కాదు.. కేవలం రాత్రుళ్లే. ఈ వార్తతో హిందూ, ముస్లింలు దర్గాను పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కుతున్నారు. దీనిని దేవుడి మహిమగా భావిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం ఇదంతా ఉట్టిదేనని, మూఢనమ్మకమంటూ కొట్టిపారేస్తున్నారు. ఇది నిజమా? లేక దర్గాకు ప్రాచుర్యం కోసం కల్పిస్తున్న ప్రచారమా? తేలాల్సి ఉంది.