: అవసరమైతే ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయండి: అధికారులకు సీఎం ఆదేశం


వేసవి తాపం నానాటికీ పెరుగుతుండడం, ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తాగునీటి ఎద్దడిపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. అవసరమైన చోట ట్యాంకర్లతో సరఫరా చేసైనా సరే తాగునీటి అవసరాలను తీర్చాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ క్రమంలో తాగునీటికి అవసరమైన నిధులను విడుదల చేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు. 

  • Loading...

More Telugu News