: కసిగా పనిచేస్తే 294 అసెంబ్లీ, 42 ఎంపీ స్థానాలు టీడీపీవే : చంద్రబాబు
కాంగ్రెస్, వైకాపాలపై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. 13 జిల్లాలకే పరిమితమైన వైకాపా సమైక్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సోనియాకు తెలియకుండానే వైఎస్ అంత అవినీతి చేశాడా? అని ప్రశ్నించారు. వైసీపీది రోజుకో మాట... కాంగ్రెస్ ది మనిషికో మాటని వ్యంగ్యంగా విమర్శించారు. ప్రధాని మన్మోహన్ ఓ రోబో అని... అయితే, రజనీకాంత్ రోబో శక్తిమంతమైనదైతే, సోనియా రోబో పనికిరానిదని ఎద్దేవాచేశారు.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కసిగా పనిచేస్తే 294 అసెంబ్లీ, 42 ఎంపీ స్థానాలు గెలుపొందవచ్చని చంద్రబాబు అన్నారు. టీడీపీ గెలుపు ప్రజలకు అవసరమని తెలిపారు. గతంలో తెలుగుదేశం అధికారంలోకి రాగానే... రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిందని గుర్తుచేశారు. తెలుగుదేశం ఇప్పటికీ సమన్యాయం నుంచి పక్కకు మరల్లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపా, తెరాసలు భూస్థాపితం కావడం ఖాయమని బాబు చెప్పారు.