: ప్రపంచ టాప్ టెన్ హాలిడే స్పాట్ జాబితాలో కేరళ
ప్రపంచ పది ఉత్తమ హాలిడే స్పాట్ జాబితాలో కేరళ చోటు సంపాదించింది. మొత్తం పది ప్రాంతాలు ఈ జాబితాలో నిలవగా భారత్ నుంచి కేరళ రాష్ట్రం చోటు దక్కించుకోవడం విశేషం. తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనుకునే వారు తప్పకుండా 2014లో కేరళ వెళ్లవచ్చని ట్రావెల్స్ గైడ్ పబ్లిషర్ లోన్లీ ప్లానెట్ పేర్కొంది. ఈ జాబితాలో న్యూయార్క్ సిటీ, డెన్మార్క్, ప్రాగ్, ఐస్ లాండ్, ఇటలీ, హవాయి, కేరళ ఉన్నాయి. ఇందుకుగాను లోన్లీ ప్లానెట్ నుంచి కేరళ టూరిజమ్ డైరెక్టర్ ఎస్.హరికిషోర్ అవార్డును స్వీకరించారు.