: సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై కేసుపెడతా: రాంగోపాల్ వర్మ
సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆరోపించారు. తాను తీసిన సత్య 2 సినిమా హిందీ భాషలో విడుదలైనప్పటికీ తెలుగులో సెన్సార్ బోర్డు కారణంగా విడుదల కాలేదు. సత్య 2 విడుదల విషయంలో తమను చాలా ఇబ్బందులకు గురి చేసిందని రాంగోపాల్ వర్మ ఆరోపించారు. ఈ కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారని, అందుచేత సోమవారం ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో కేసు వేస్తానని వర్మ తెలిపారు. ధనలక్ష్మిపై గతంలో చాలా ఆరోపణలు ఉండగా, మోహన్ బాబు వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.