: ఐసీసీ టాప్ ఆల్ రౌండర్ గా అవతరించిన అశ్విన్


భారత క్రెకెటర్ అశ్విన్ ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నిన్న కోల్ కతాలో ముగిసిన మొదటి టెస్టు మ్యాచ్ లో బంతితో పాటు బ్యాట్ తోనూ రాణించడంతో అశ్విన్ ఆల్ రౌండ్ల జాబితాలో అగ్ర స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో, బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్, సౌతాఫ్రికా క్రెకెటర్ కలిస్ ను అశ్విన్ వెనక్కు నెట్టాడు. దీంతో పాటు, బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో 18 స్థానాలు ఎగబాకి 45వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే బౌలర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరచుకొని ఆరో స్థానానికి ఎదిగాడు.

  • Loading...

More Telugu News