: ఇందిరాగాంధీ నిర్ణయాలను సోనియా గౌరవిస్తోంది : డీఎస్


తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు, రాహుల్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేశారని అన్నారు. వరంగల్ లో జరుగుతున్న టీ కాంగ్రెస్ కృతజ్ఞత సభలో డీఎస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ తెలంగాణ కోసం పోరాడుతోందని చెప్పారు. 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో తెలంగాణను చేర్చామని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియా అప్పుడే చెప్పారని డీఎస్ అన్నారు. ఇందిర కలిసుండాలంటే... సోనియా విడదీస్తోందని కొంత మంది పెద్దలు అంటున్న మాట సరైంది కాదని... సీఎంను ఉద్దేశించి డీఎస్ కామెంట్ చేశారు. ఇందిరాగాంధీ నిర్ణయాలను సోనియా గౌరవిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలో చేసుకున్న ఒప్పందాల్లో... సీమాంధ్రులు ఏ ఒక్కదాన్ని కూడా గౌరవించలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News