: ఫార్య్చూన్ జాబితాలో భువనేశ్వరి నిలవడం గర్వకారణం : చంద్రబాబు
దేశంలో శక్తిమంతమైన మహిళా వ్యాపార వేత్తల్లో నారా భువనేశ్వరికి స్థానం దక్కడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ఫార్చ్యూన్ పత్రిక విడుదల చేసిన జాబితాలో భువనేశ్వరి నిలవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. హెరిటేజ్ అభివృద్ధికి భువనేశ్వరి ఎంతో కృషి చేశారని బాబు ట్విట్టర్ లో కొనియాడారు. భారత వాణిజ్య రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో రాష్ట్రానికి చెందిన అపోల్ హాస్పిటల్స్ ఎండీ ప్రీతిరెడ్డి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొత్తగా చోటు సంపాదించుకున్నారు.