: హైదరాబాదుపై ఆంక్షలు విధిస్తే ఒప్పుకోం : కేసీఆర్


హైదరాబాదులో శాంతి, భ్రదతలపై ఆంక్షలు విధిస్తే ఒప్పుకునేది లేదని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తెలంగాణకు ఎందుకు? అని ప్రశ్నించారు. హైదరాబాదుపై ఆంక్షలను అంగీకరించేది లేదని కరీంనగర్ లో కేసీఆర్ స్పష్టం చేశారు. టీ మంత్రులు, నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు పోరాటం చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News